![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-37 లో.. సూర్య, మురళి వాళ్ళతో కలిసి జాను క్రికెట్ ఆడుతుంది. బావ నువ్వు ఇప్పుడు వేసే బాల్ నాకు ఎదురైన సమస్య లాంటిది. దానిని నేను ఎదుర్కుంటానా లేదా అనేది నా బ్యాటింగ్ పైన ఆధారపడి ఉంటుంది.. బాల్ వెయ్ అని జానూ అనగానే మురళి బాల్ వేస్తాడు. జానూ కొడుతుంది కానీ అది నేరుగా సూర్య చేతిలోకి వెళ్తుంది. అలా జానూ రెండు మూడు సార్లు ప్రయత్నించినా అది సూర్య చేతుల్లోకే వెళ్తుంది. ఇక నాలుగో సారి తన బలాన్ని అంతా కూడగట్టుకొని కొడుతుంది.. అది చాలా దూరం వెళుతుంది. దాంతో జానూకి తన మీద తనకి కాన్ఫుడెన్స్ వస్తుంది. మరోవైపు సింహాద్రి కొడుకు కళ్యాణ్ తో గౌతమి ఫోన్ మాట్లాడుతుంది.
నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని వెళ్తావని అనుకున్నాను కానీ నువ్వు రాలేదని కళ్యాణ్ తో గౌతమి అనగానే అమ్మో.. మా నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడని కళ్యాణ్ అంటాడు. అప్పుడే సింహాద్రి అటుగా వెళ్తూ కళ్యాణ్ దగ్గరికి వస్తాడు. ఎవర్రా ఫోన్ లో అని సింహాద్రి అనగానే ఫ్రెండ్ డాడీ అని కవర్ చేస్తాడు. సరే అని సింహాద్రి వెళతాడు. ఇక అదే సమయంలో గౌతమి దగ్గరికి నందు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. సింహాద్రి కొడుకు కళ్యాణ్ తో అని గౌతమి అనగానే ఎందుకు మాట్లాడుతున్నావని నందు అడుగుతుంది. ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నాడో కనుక్కోవడానికి చేశానని గౌతమి కవర్ చేస్తుంది. సింహాద్రి అంకుల్ ఇంట్లోనే ఉన్నాడని గౌతమి చెప్పగానే నందుకి డౌట్ వస్తుంది. దాంతో జాను దగ్గరికి వచ్చి విషయం చెప్తుంది.
మరోవైపు సింహాద్రి వాళ్ళ భార్య అరుణకి ఒక డౌట్ ఉంటుంది. అసలు ఎందుకు శంకర్ అన్నయ్య వాళ్ళ తోట, ఇల్లు అనేటప్పుడే కంగారుపడతాడు. అసలు ఆ రోజు ఆయన చూసిన డాక్యుమెంట్లు ఏంటని అరుణ కబోర్డ్ అంతా వెతుకుతుంది. అందులో తోటకి సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటాయి. అవి చూసిన అరుణ షాక్ అవుతుంది. అప్పుడే అక్కడికి సింహాద్రి వస్తాడు. ఏంటండి ఇవి అని అరుణ అడుగగా ఆమె చెంపమీద కొడతాడు. నీ పని కాదు ఇది..టిఫిన్ ఏం చేయాలి.. భోజనం ఏం చేయాలి.. నైట్ కి చపాతీనా, పుల్కానా ఇవి మాత్రమే చూస్కోవాలి.. ఇలాంటి వాటి గురించి పట్టించుకోకూడదని అరుణకి వార్నింగ్ ఇచ్చి గది బయటకు వెళ్తాడు సింహాద్రి. బయట అప్పటికే జానూ, నందు వస్తారు. ఏంటి అంకుల్.. ఏదో గొడవపడుతున్నారు. తోట, డాక్యుమెంట్లు, బ్యాంక్ అని ఏదో మాట్లాడుతున్నారని జానూ డౌట్ గా అడిగేసరికి సింహాద్రి కవర్ చేస్తాడు. నాకు తోట మీద, ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్న లోన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయని జానూ అనగానే నన్నే అనుమానిస్తున్నావా అని సింహాద్రి అంటాడు. మిమ్మల్ని కాదు అంకుల్ ఈ విషయం మీద డౌట్ ఉంది అని నందు అంటుంది. ఆ తర్వాత నందు, జానూలని సింహాద్రి బ్యాంక్ కి తీసుకెళ్తాడు. అక్కడ లోన్ ఇచ్చిన ఆఫీసర్స్ తో సింహాద్రి అమర్యదగా మాట్లాడతాడు. మీరు సంవత్సరం నుండి లోన్ కట్టకుండా ఇలా బ్యాంక్ కి వచ్చి ఎందుకు గొడవచేస్తున్నారని వాళ్ళు తిడతారు. నేను మేనేజర్ తో మాట్లాడాలని జానూ అనగానే సింహాద్రితో పాటు అక్కడి వాళ్ళంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |